డీజీపీ గౌతమ్ సవాంగ్
మన గ్రేహౌండ్స్ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజని అన్నారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్ బలగాలు సేవలు అందిచనున్నాయని, గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. నైట్ ఫైరింగ్ విషయంలో ఏపీ అక్టోపస్ అత్యుత్తమ శిక్షణ ఇస్తోందని చెప్పారు.