చంద్రబాబు
అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ఇది పాదయాత్ర కాదని.. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అంటూ .మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని పేర్కొన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని మండిపడ్డారు.