ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది.14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ.కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 8 వరకు, పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది.