Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

యుద్ధ ప్రాతిపదికనతుంగభద్ర గేటు పనులు

డ్యామ్‌ను పరిశీలించిన మంత్రులు పయ్యావుల, రామానాయుడు

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం : కర్నాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యామ్‌కు చెందిన కొట్టుకుపోయిన 19వ నంబరు గేటును పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పయ్యావుల మాట్లాడుతూ నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డ్యామ్‌ గేటు సిద్ధం చేసే అవకాశం ఉందని, అయితే నష్టం వేల కోట్ల రూపాయలకు వెళుతోందన్నారు. డ్యామ్‌ గేటు నీటి ప్రవాహం ఉండగానే దించాలా, ఆగిన తర్వాత దించాలా అనే సాంకేతిక సమస్యలు ఉన్నాయని, నిపుణులు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ విషయమై మన ఇంజనీర్లు… దేశంలోని ఇంజనీర్లందరినీ సంప్రదిస్తున్నారని తెలిపారు. నిపుణులు ఏం చెప్పినా దానికి సహకరించేందుకు ఆంధ్ర, కర్నాటక ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రిటైర్డ్‌ అధికారి కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారని, మూడు సంస్థలకు గేట్లు నిర్మాణం బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామని, ఈ సమస్యతో విలువైన సాగు, తాగు నీటిని కోల్పోతున్నామని తెలిపారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చేపడుతున్నామన్నారు. డ్యామ్‌ వద్ద 1625 అడుగులు నీరు ఉండగానే గేట్లు అమర్చే ప్రయత్నం చేస్తున్నామని, బుధవారం ఉదయానికి గేట్లు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడం గత పాలకుల నిర్లక్ష్యమన్నారు.
డ్యామ్‌ను పరిశీలించిన కర్నాటక సీఎం సిద్దరామయ్య
తుంగభద్ర డ్యామ్‌ను కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం పరిశీలించారు. ఆయనతో పాటు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి భోసరాజు, మంత్రి శివరాజ్‌ తంగడిగే, కర్నాటక, ఆంధ్ర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌ సమస్యను బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, తనకు రాజకీయం ముఖ్యం కాదని, రైతులే ముఖ్యమని తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 105 టీఎంసీల నీరు ఉండగా, డ్యామ్‌ నుంచి 50 నుంచి 60 టీఎంసీల నీరు వృధాగా పోతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img