దేశ చరిత్రలో రాజధానిలేని రాష్ట్రంగా ఏపీని చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. నాల్గవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు.ఏపీ రాజధాని అంశంపై విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం తగదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదనేది పరీక్షల్లో ప్రశ్నగా వస్తే విద్యార్థులు ఏం జవాబు రాయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతినే ఏపీ రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.