ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతుందని..దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాత్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఘటనలపై రాష్ట్రపతికి టీడీపీ నేతల బృందం నివేదిక అందజేసింది.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘డగ్ ఫ్రీ ఏపీ’ కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. మీడియాను నియంత్రిస్తున్నారని చెప్పారు. వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి పార్లమెంట్ సభ్యుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.