చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. బాబు లాంటి ద్రోహి ఉండటానికి వీల్లేదని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని చెప్పారు. అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు మతిభ్రమించింది. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎల్లో మీడియాతో కలిసి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరుతామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ కోరాలని డిమాండు చేశారు.