ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.