కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని, 30 మంది దాడిచేయగా వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వెంకటేశ్ నామినేషన్ పత్రాలు చించివేసి..ఫోన్ లాక్కొన్నారని తెలిపారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరారు. దాడులు చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.