‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల’ ఏర్పాటులో పురోగతిపై బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్‌ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 24 కల్లా వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, ఐటీ బ్రాండిరగ్ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండిరగ్ అవసరమని, ఐటీ బ్రాండిరగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఐటీ అధికారులను ఆదేశించారు.