వైద్యులు సహా 50 మంది సిబ్బందికి పాజిటివ్..
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. . ఆసుపత్రిలోని మొత్తం 50 మంది వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.కాగా.. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.