: విజయసాయిరెడ్డి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని పేర్కొన్నారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని, రెండు వారాలు అనుమతివ్వాలని కోరారు. కాగా విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16కి కోర్టు వాయిదా వేసింది.