London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

విద్యార్థుల కిట్లకు కొత్త టెండర్లు

వచ్చే ఏడాది పంపిణీకి కార్యాచరణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సంబంధించి విద్యార్థి కిట్ల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియ, బడ్జెట్‌ అంచనాలలో ప్రభుత్వం నిమగ్నమైంది. 202526 విద్యా సంవత్సరానికిగాను ఈ టెండర్ల ప్రక్రియ, అంచనాల రూపకల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ఉత్తర్వులు జారీజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం జగన్న విద్యా కానుకగా ఉండగా… చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకంగా మార్చారు. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న ఆయా పాఠశాల విద్యార్థులకు ఈ కిట్లను గత ప్రభుత్వం నుంచి అందజేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరానికి కొత్తగా పిలిచిన టెండర్లతో కిట్లలో యథాతథంగా వస్తువులు ఉంటాయా? తగ్గుతాయా? అనే సందేహాలున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు టోఫెల్‌ను తొలగించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరానికి అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరుతో వైసీపీ ప్రభుత్వం కిట్ల పంపిణీ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఏడాదికిగాను ఆ కిట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, 3 జతల యూనిఫారం, బెల్టులు, బూట్లు, సాక్స్‌లు, టోఫెల్‌ వర్క్‌బుక్స్‌, స్కూల్‌ బ్యాగ్‌, బెల్ట్‌, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు, 15 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్‌లు, డిక్షనరీలు, 610 తరగతులకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. 2024`25 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు 36 లక్షల కిట్లను విద్యార్థులకు చేరవేశారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీన పాఠశాలల పున:ప్రారంభ సమయానికి ఈ కిట్ల పంపిణీ కోసం టెండర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విద్యార్థుల కిట్ల బడ్జెట్‌ అంచనాలను ఈ ఏడాది సెప్టెంబరు 4వ వారంలోగా పూర్తి చేసి… ఆర్థికపరమైన అనుమతుల మంజూరును అక్టోబరు 2వ తేదీలోగా ముగించుకునేలా ప్రణాళిక రూపొందించారు.
అంచనాలతో కూడిన టెండర్ల ముసాయిదాను 3వ వారంలోగా, నాలుగో వారంలో టెండర్లు పిలిచేలా ప్రణాళిక తయారు చేశారు. డిసెంబరు మొదటివారంలో టెండర్లను ఖరారు చేసి… మూడో వారంలో వర్క్‌ ఆర్డర్లు జారీజేస్తారు. 2025 జనవరి నాలుగో వారంలో కిట్ల నాణ్యత నమూనాలు పరిశీలించి… అందులో ఏమైనా మంచిగా లేకుంటే తిరస్కరిస్తారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఆయా జిల్లాలు/మండలాలు/స్కూల్‌ కాంప్లెక్స్‌లకు కిట్లు పంపుతారు.
జూన్‌ మొదటి వారంలో కిట్లు పాఠశాలలకు చేరతాయి. అనంతరం పాఠశాల పున:ప్రారంభం రోజు విద్యార్థులకు కిట్లు అందజేస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల ప్రాజెక్టు ప్రక్రియను సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img