ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని పేర్కొన్నారు.మూడు దశల్లో విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో చేపడుతున్న 4530 విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులు సీఎంకు వివరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలని, విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. వీటి నిర్వాహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఉగాది నాటికి ఫేజ్1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 2022 నాటికి ఫేజ్2 పూర్తి చేసేలా కార్యాచరణ చేయాలన్నారు. జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అన్‌ఇంటరెప్టడ్ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.