హిందూపురం నుంచి బాలకృష్ణ ర్యాలీ
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లాలో తన నియోజక వర్గం హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్ష చేపట్టారు. . ముందు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్షకు కూర్చున్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తాను రాజీనామా చేస్తానని.. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదిలాఉంటే.. మౌన దీక్ష అనంతరం బాలకృష్ణ సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.