asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ హామీ దృష్ట్యా మూడేళ్లుగా యువత ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. గ్రూప్‌ వన్‌ ఎంపిక తీరు పట్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అస్మదీయుల కోసం గ్రూప్‌ వన్‌లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. రెండు సార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడాతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గ్రూప్‌ వన్‌ ఎంపికపై విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img