చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
తమ ప్రజల మనోభావాలు కించ పరిచేలా బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడటం దారుణమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోమువీర్రాజు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. కడప ప్రజలు హత్యలు చేసేవాళ్ళని అనడం సరికాదని, అందుకు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు వ్యక్తిగత వ్యాఖ్యలా.. పార్టీ స్టాండా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సినిమాల్లో లాభాల కోసం, ఫ్యాక్షన్ చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పోలీస్ రికార్డులలో చూస్తే ఎక్కడ క్రైమ్ ఎక్కడుందో అర్థముంటుందని తెలిపారు. అసలు కడప ప్రజలు అందర్నీ గౌరవించే వ్యక్తులని, తమ కడుపు కాలిన ఎదుటి వారి కడుపు నింపే తత్వం కడప వాళ్లదని చెప్పారు.