విశాఖ సీఐ స్వర్ణలత కస్టడీలో వెలుగులోకి సంచలన విషయాలు
విశాఖలో నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా ఉన్న సీఐ స్వర్ణలత ఒక్కరోజు కస్టడీ ముగిసింది. ఆమెను గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్‌లో ప్రశ్నించారు.. అనంతరం శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో స్వర్ణలత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే రూ.2వేల నోట్ల మార్పిడి డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ నేవీ ఉద్యోగులు స్వర్ణలత ముఠా ఆలోచనలు ముందే పసిగట్టినట్లు సమాచారం. రూ.12లక్షలు ఒక బ్యాగ్ లోను.. మిగిలిన డబ్బులు డిక్కీలో స్టెప్నీ టైర్ కింద ఉంచారు. స్వర్ణలత సినిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను మభ్య పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా గ్యాంగ్ చెప్పారట. నేవీ ఉద్యోగులు 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ రూ. కోటి తాము తీసుకుని వెళ్ళలేదని చెప్పారు. రూ.2వేల నోట్ల మార్పిడి దందాను విచారణ అధికారులు ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంపముంచిందని స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. షూటింగ్‌లోనే ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయమైనట్లు విచారణలో ఆమె చెప్పారట. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నేరానికి సిద్ధపడినట్టు సీఐ స్వర్ణలత అంగీకరించారట. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు భార్య జైలులో ఉన్న సరే.. సీఐ స్వర్ణలత భర్త అమెరికా నుంచి ఇండియాకి రాలేదని చెబుతున్నారు. ఆమె భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో చదువుతున్న స్వర్ణలత కుమారుడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు.
రూ.2వేల నోట్ల మార్పిడి పేరుతో రిటైర్ నేవి ఉద్యోగుల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై సీఐ స్వర్ణలత, మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సీఐ స్వర్ణలత తమ సినిమా ాఏపీ 31్ణలో హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ తెలిపారు. తమ సినిమాలో సీఐ ఓ అతిథి పాత్రలో మాత్రమే ఆమె నటించారన్నారు. ఈ మూవీలో ఆమె పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న స్వర్ణలత డ్యాన్స్ వీడియోలు తమ సినిమాలోవి కాదని చెప్పారు. తాము తీస్తున్న మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కేవీఆర్ తెలిపారు. తమ చిత్రంపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదన్నారు.డియాలో అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదన్నారు.