Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రాజ్యసభ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీలు..

రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేశారు. ఈమోపిదేవి, బీద మస్తాన్ రావులు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని మోపిదేవి వెల్లడించారు.ఏ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాను ఏమిటనేది వైసీపీ నేతలే ఆలోచించాలన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో వైసీపీ వాళ్లే చెబుతారని అన్నారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదని.. రాజ్యసభ పదవిపై తాను మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా లేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను.. రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టాలని చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కూడా తనతో చర్చించారని మోపిదేవి వెల్లడించారు.రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గం వెళ్లి కార్యకర్తలతో సమావేశం అవుతానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత తాను ఖాళీగా ఉండాలని అనుకోవడం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. పార్టీ మారుతున్న తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. గతంలో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగజేసారో అందరికీ తెలుసని మోపిదేవి తెలిపారు. మొత్తానికి మోపిదేవి, బీద మస్తాన్ రావులు ముందుగా చెప్పినట్టుగానే రాజీనామా చేశారు. అయితే వీరి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img