ఇక నుంచి మహిళా పోలీస్ స్టేషన్ లుగా నామకరణం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి ఉ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా.. వాటి పేర్లను మారుస్తూ కూటమి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఏడాది జూన్ లోనే పేరు మారుస్తామని వెల్లడించారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు పేరు మార్పు చేశారు..