చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్‌పై అభియోగాలు
నిన్న విచారణకు గైర్హాజరు..గతంలోనూ కుమారుడి అరెస్ట్ చూపి విచారణకు డుమ్మా
వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ నిన్న విచారణకు డుమ్మా కొట్టడంతో పోలీసులు మరోమారు నోటీసులు ఇచ్చారు. నేటి సాయంత్రం 4 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో కుమారుడి అరెస్ట్‌ను సాకుగా చూపి గతంలోనూ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట జోగి రమేశ్ హాజరయ్యారు. గంటపాటు విచారించిన అనంతరం ఆయనను పంపించి వేశారు. నిన్న మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. జోగి రమేశ్ విచారణకు రాలేకపోతున్నట్టు ఆయన తరపు లాయర్లు పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజగా మరోమారు పోలీసులు నోటీసులు జారీచేశారు.