ఏపీ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దయ్యింది. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు చీరాల వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాలకు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతలను ఆదుకుంటామని, వారు తయారుచేసిన చీరలకు మార్కెటింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.