శ్రీశైల జలాశయంకు భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో జలాశయంకు చెందిన మూడు గేట్లను 10అడుగుల మేర ఎత్తి దిగువకు 56,100 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ కు విడుదల చేస్తున్నట్లు కర్నూలు ఇరిగేషన్ సీఈ కబీర్ భాషా బుధవారం వెల్లడించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయంకు ఇటు తుంగభద్ర, అటు కృష్ణా నుంచి భారీగా వరదనీరు చేరుతుందన్నారు. దీంతో శ్రీశైలం జలాశయంకు 885 అడుగుల గానూ అదే స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ సాగర్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులు, కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారన్నారు.ప్రస్తుతం ప్రాజెక్టులో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదే సందర్భంలో ఎగువ జూరాల స్పిల్ వే నుంచి 2,27,115 విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,820 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయంకు చేరుతుందన్నారు. ఇక సుంకేసుల నుంచి 2280 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,55,215 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా ఉందన్నారు. ఇక ఇదే సమయంలో జలాశయం నుంచి ఏపీ కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 31,117 క్యూసెక్కుల నీటి వినియోగంతో 15.409 మెగా యూనిట్లను, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కుల వినియోగంతో 16.890 మెగా యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు.
ఇక ఇదే క్రమంలో శ్రీశైల జలాశయంకు చెందిన 12 గేట్లలో రెండు గేట్ల ద్వారా 56,150 క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్ కు విడుదలవుతుందన్నారు. మొత్తంగా ఈ ఏడాది శ్రీశైల గేట్లను పైకి ఎత్తి దిగివకు నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి. ఇక శ్రీశైలం డ్యాం నుంచి మల్యాల ఎత్తిపోతల పథకం కు 1545, పోతిరెడ్డిపాడుకు 30000, తెలంగాణలోని కల్వకుర్తి ప్రాజెక్టు 2400
క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని తెలిపారు.