భారీ వర్షాలు , వరదల వల్ల ఏలేరు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటుంది. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి. దీంతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని లంక ప్రాంతాల ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.