వైఎస్ వివేకా కుమార్తె వైస్ సునీత..బుధువారం ఏపీ హోమ్ మంత్రి అనితతో భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు లో జరిగిన అన్యాయం పై అనితకు వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోమ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సునీత..గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారన్న సునీత..ప్రస్తుతం సీబీఐ విచారణ లో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.