హైదరాబాద్: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌బీఎల్) తన 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా 18 కొత్త బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విస్తరణ దేశవ్యాప్తంగా మొత్తం (ఉత్కర్ష్ ఎస్‌ఎఫ్‌బీఎల్) బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల సంఖ్యను 966కి తీసుకువచ్చిందని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ పర్వీన్ కుమార్ గుప్తా చెప్పారు. బీహార్‌లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకటి, జార్ఖండ్‌లో రెండు, కేరళలో రెండు, మధ్యప్రదేశ్‌లో మూడు, మహారాష్ట్రలో ఒకటి, ఒడిశాలో రెండు, ఉత్తరప్రదేశ్‌లో రెండు, ఉత్తరాఖండ్‌లో ఒకటి మొత్తం ఎనిమిది బ్యాంకింగ్ అవుట్ లెట్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వినూత్న కస్టమర్ కేంద్రీకృత బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ గోవింద్ సింగ్ మాట్లాడుతూ ఉత్కర్ష్ కోర్ ఇన్వెస్ట్ లిమిటెడ్ ప్రారంభం నుండి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారడం వరకు, గత సంవత్సరాలుగా వృద్ధి, అభ్యాసం, నిబద్ధతతో కూడిన విజయమని వ్యాఖ్యానించారు.