న్యూఢల్లీి: ఆల్-ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), ఒప్పో ఇండియా, నేడు జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్-వ్యర్థాలపై అవగాహన డ్రైవ్ (ఇ-వేస్ట్)తో ‘జనరేషన్ గ్రీన్’ క్యాంపెయిన్ రెండవ విడతను ఢల్లీి విశ్వవిద్యాలయంలోని రామ్‌జాస్ కళాశాలలో ప్రారంభించాయి. దీనితో, ఈ కళాశాల మొదటి ‘ఎకో-కాన్షియస్ ఛాంపియన్ ఇన్‌టిట్యూట్’గా నిలిచింది. మొదటి దశలో భాగంగా, ఒప్పో ఇండియా, ఏఐసీటీఈ భారతదేశంలోని కళాశాలల్లో ఇంటర్న్‌షిప్‌లను అందించడం ద్వారా యువతలో హరిత నైపుణ్యాలను ప్రోత్సహించాయి. ఈ ఇంటర్న్‌షిప్‌ల కోసం 1,400 సంస్థల నుంచి 9,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,000 మంది ఎంపికయ్యారు. ఈ విద్యార్థులు ఇప్పుడు అవగాహన సెషన్‌లు, ఇ-సర్వేలు, గ్రీన్ డే వేడుకలు మొదలైన సుస్థిరత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు.