గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ తాజాగా భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన దాని రాబోయే ఏఐ-ఆధారిత లాండ్రీ స్పెషలిస్ట్‌ను ప్రవేశపెట్టింది. శామ్‌సంగ్ ఈ తాజా ఆవిష్కరణతో భారతీయ కస్టమర్లకు వాషింగ్ అనుభవాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. రోజువారీ దినచర్యలలో అత్యాధునిక సాంకేతికతను సజావుగా అనుసంధానించే దాని సామర్థ్యంతో, ఏఐ శక్తితో కూడిన కొత్త వాషింగ్ మెషీన్ ప్రక్రియను సరళంగా, మరింత ప్రభావవంతంగా చేయడం ద్వారా లాండ్రీలో గొప్ప మార్పులకు హామీ ఇస్తుంది. శామ్‌సంగ్ సౌలభ్యాన్ని పునరుద్ధరించాలని, కస్టమర్‌లకు ‘తక్కువతో ఎక్కువకాలం మన్నే’ సామర్థ్యాన్ని అందించాలని కోరుకుంటోంది. ఆ లక్ష్యానికి ఈ ఆవిష్కరణ అనుగుణంగా ఉంది. శామ్‌సంగ్ 1974లో తన మొదటి వాషింగ్ మెషీన్‌ను ప్రవేశపెట్టింది అప్పటి నుండి వాషింగ్ మెషీన్ ఆవిష్కరణలను కొనసాగిస్తూ ఉంది. కంపెనీ తన మొదటి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను 1979లో ప్రారంభించింది, ఇది వాషింగ్ మరియు స్పిన్నింగ్‌లను ఒకే టచ్‌తో కలపడం ద్వారా లాండ్రీని సులభతరం చేసింది.