న్యూఢల్లీ : ఉత్తర భారతదేశంలోని రియల్టీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించిన గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్, సిగ్నేచర్ గ్లోబల్, తమ అన్ని టవర్లు, బేస్‌మెంట్లు, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వెంట సెక్టార్ 84, గురుగ్రామ్, హర్యానాలో దాని రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం భవనాలు కోసం సివిల్, స్ట్రక్చర్, పార్ట్ ఎంఈపి పనుల కోసం ఏసిసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నియమించింది. సెప్టెంబర్ 12, 2024 నాటి ఎల్‌ఓఐ మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 320 కోట్లుగా నిర్ణయించింది. పని ప్రారంభించిన తేదీ నుండి 27 నెలలులో పూర్తి కావలసి ఉంటుంది. పనిని పూర్తిగా అప్పగించటానికి 3 నెలల వరకు అదనపు సమయం ఉంటుంది. సిగ్నేచర్ గ్లోబల్ వైస్ చైర్మన్ లలిత్ అగర్వాల్ మాట్లాడుతూ మేము పూర్తి చేయబోతున్న అత్యుత్తమ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి మరియు మా పోర్ట్‌ఫోలియోలో మకుటాయమానంగా ఉంటుందని అన్నారు.