ముంబయి: ఈ పండుగ సీజన్, ఒప్పో ఇండియా ఒప్పో రెనో 12 ప్రో 5జీ మనీష్ మల్హోత్రా లిమిటెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది భారతదేశపు శక్తివంతమైన సంస్కృతిని, సంప్రదాయాలను ఆచరించుకునేందుకు సరైన స్మార్ట్‌ఫోన్. మనీష్ మల్హోత్రా ఐకానిక్ వరల్డ్ కలెక్షన్ నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రత్యేక ఎడిషన్, సొగసైన బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో క్లిష్టమైన గోల్డ్ ఫిలిగ్రీ, పూల ఎంబ్రాయిడరీతో భారతీయ డిజైన్ వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. మల్హోత్రా సిగ్నేచర్ మోటిఫ్‌లతో ఒప్పో వినూత్న మెటీరియల్ డిజైన్ కలయిక భారతదేశంలోని పండగ స్ఫూర్తిని అద్భుతమైన వేడుకలో లగ్జరీ, హస్తకళను మిళితం చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ బాడీ గ్రాఫిక్స్ భారతదేశంలోని గొప్ప కళాత్మక సంప్రదాయాల నుంచి తీసుకున్నారు.