హైదరాబాద్ : గత ఆరు సంవత్సరాలుగా రైతులకు నానో బయో గుళికలను కృష్ణ ఆగ్రో బయో ప్రోడక్ట్స్ సరఫరా చేస్తుంది. ఇప్పుడు కృష్ణ ఆగ్రో బయో ప్రొడక్ట్స్‌కు ఐసీఏఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, కొజికోడ్, కేరళ అభివృద్ధి చేసిన పేటెంటెడ్ సంపుటీకరణ సాంకేతికతను వినియోగిం చుకునేందుకు లైసెన్స్ మంజూరు చేశారు. మెరుగైన నేల పోషక ద్రావణీకరణ, వృద్ధి, దిగుబడి కోసం వ్యవసాయ పంటలకు పంపిణీ చేసే జెలటిన్ గుళికలకు ఆకర్షితమయ్యే సూక్ష్మ జీవుల సంపుటీకరణను ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది. ఈ పరిజ్ఞానాన్ని అన్ని రకాలగానూ వ్యవసాయ పరంగా అతి ముఖ్య మైన సూక్ష్మజీవులైనటువంటి, ఎన్`ఫిక్సర్స్ న్యూట్రియంట్ సొల్యుబ్లిజర్స్/ మొబిలైజర్లు, మొక్కల వృద్ధిని ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా (పీజీపీఆర్), ట్రైకోడెర్మా, బుర్కోల్డెరియా మొదలైనవ వాటిని అందించడానికి ఉపయోగించవ చ్చునని కృష్ణ ఆగ్రో బయో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ హెడ్ సుమన్ తెలిపారు.