న్యూదిల్లీ: కొత్త హ్యుందాయ్ క్రెటా ‘ఇండియాస్ బెస్ట్ డిజైన్ ప్రాజెక్ట్స్ అవార్డు’ను సొంతం చేసుకుంది. క్రెటా డిజైన్‌కు గాను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ఈ పురస్కారం అందుకుంది. హెచ్‌ఎంఐఈ హ్యుందాయ్ అడ్వాన్స్‌డ్ డిజైన్ ఇండియా విభాగాధిపతి చోహీ పార్క్ మాట్లాడుతూ, హ్యుందాయ్ మోటార్ ‘సెన్సుయస్ స్పోర్టినెస్’ డిజైన్ లాంగ్వేజ్ ద్వారా డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.