ముంబయి: భారతదేశపు మొట్టమొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, ఎడెల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ముంబైలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ సహకారంతో క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు చెందిన విభిన్న కస్టమర్ బేస్ ఎడెల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సమగ్ర జీవిత బీమా ఉత్పత్తులను పొందే వెసులుబాటు కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భద్రత అవసరాన్ని పరిష్కరిస్తుంది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ సర్వజిత్ సింగ్ సమ్రా మాట్లాడుతూ, ఎడెల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎడెల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుమిత్ రాయ్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా అసాధారణమైన వినియోగదారుని అనుభవం, అత్యుత్తమ వ్యాపార నాణ్యత, చట్టపరమైన, నైతిక ప్రవర్తనల అత్యున్నత ప్రమాణాలకు భాగస్వామ్య నిబద్ధతను కొనసాగిస్తామని వివరించారు.