హైదరాబాద్ : దేశంలోని అతిపెద్ద అల్యూమినియం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ సంస్థ వేదాంత అల్యూమినియం బిజినెస్ 2021`22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఐఇఎక్స్)లో గ్రీన్ మార్కెట్‌పై దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత విద్యుత్ కొనుగోలుదారుగా నిలిచింది. ఒడిశా జార్సుగూడలోని తన భారీ సమగ్ర అల్యూమినియం ఉత్పత్తి కేంద్రం కోసం వేదాంత ఐఇఎక్స్‌లో గ్రీన్ టెర్మ్ ఎహెడ్ మార్కెట్ (జిటిఎఎం) నుంచి ప్రధానంగా 354 మిలియన్ యూనిట్లు సౌర, సౌరేతర పునర్వినియోగ విద్యుత్‌ను కొనుగోలు చేసిందని వేదాంత అల్యూమినయం బిజినెస్ సీఈఓ రాహుల్‌శర్మ చెప్పారు.