ముంబై ః ఆన్‌లైన్ గేమింగ్ మార్గదర్శి, పరిశ్రమలో సుప్రసిద్ధమైన జుపీ తమ నైపుణ్య అకాడమీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడిరచింది. ఇది ఉద్యోగార్హత నైపుణ్యాలను అందించడంతో పాటుగా దేశంలోని యువతకు సమానమైన ఉపాధి అవకాశాలను సైతం అందించనుంది. ఓ సంస్థ ఆరంభించిన మొట్టమొదటి, వినూత్నమైన కార్యక్రమం జుపీ స్కిల్లింగ్ అకాడమీ (జెడ్‌ఎస్‌ఏ). యువ, వెనుకబడిన భారతీయులకు నైపుణ్యం మెరుగుపరచడం, ఉన్నత విద్యావంతులను చేయడంపై ఇది దృష్టి కేంద్రీకరించింది. నైపుణ్య శిక్షణ ద్వారా భవిష్యత్‌కు వారు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దడంతో పాటుగా ఉపాధి పరంగా ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలను కల్పించాలన్నది ఆలోచన. ఈ మిషన్‌ను ఆరంభిస్తూ జుపీ ఇప్పుడు సుప్రసిద్ధ ఎన్‌జీఓ నిట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపి వినూత్నమైన సీఎస్‌ఆర్ వృత్తి విద్యా నైపుణ్య కార్యక్రమాన్ని ముంబైలో నిరుపేద యువతకు ప్రారంభించింది.