హైదరాబాద్: తెలుగు సినిమా ప్రేమికుల హృదయాన్ని, ఆత్మను అలరించేందుకు విలక్షణమైన, సరికొత్త సెలబ్రిటీ టాక్ షో, ‘ఎందరో మహానుభావులు’ కార్యక్రమాన్ని టాటా ప్లే తెలుగు క్లాసిక్స్ ప్రసారం చేస్తోంది. నటుడు, రచయిత, దర్శకుడు పరుచూరి గోపాల కృష్ణ, జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత నటి శారద, నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు మురళీమోహన్, దర్శకుడు, సినీ కథా రచయిత రేలంగి నరసింహారావు, తనికెళ్ల భరణి వంటి తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు, దిగ్గజాలు తమ వృత్తి జీవిత ప్రయాణాన్ని ఈ చాట్‌షోలో వీక్షించవచ్చు. ఈ చాట్ షోకు తొమ్మిది సార్లు నంది అవార్డులు, రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ విజేత, ప్రతిభావంతురాలు, ప్రముఖ తెలుగు నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.