ముంబయి: భారతదేశ బిలియన్-డాలర్, ది కోకా-కోలా కంపెనీ నుండి స్వదేశీ పానీయాల బ్రాండ్ థమ్స్ అప్ తాజాగా తూఫానీ బిర్యానీ హంట్ సీజన్ 2ని ప్రకటించింది. ఈ కొత్త సీజన్, గొప్ప ఆదరణ పొందిన సీజన్ 1కు కొనసాగింపు, రుచికరమైన బిర్యానీ జత కోసం మళ్ళీ పుంజుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో, రాబియే ఎడిషన్ అద్భుతమైన పాక ప్రయాణాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. డిస్నీG హాట్‌స్టార్ క్రియేటివ్‌వర్క్స్ ద్వారా సంభావితమై రూపొందించబడిన, థమ్స్ అప్ తూఫానీ బిర్యానీ హంట్ సీజన్ 2లో చేరండి, ప్రతి బిర్యానీ తూఫానీ మూలాన్ని అర్థం చేసుకోవడానికి చెఫ్ రణవీర్ బ్రార్ హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, లక్నో, ఢల్లీి, ముంబై, కోల్‌కతా వంటి ఏడు విభిన్న ప్రాంతాలను అన్వేషించారు. ఒక్కో రకమైన కథనం ద్వారా, హంట్ దేశంలోని 21 మంది హాటెస్ట్ బిర్యానీ తయారీదారుల గురించి దాగివున్న కథలను సజీవంగా తీసుకువస్తుంది, ప్రతి హాట్‌స్పాట్ వెనుక ఉన్న ప్రేరణను చెఫ్ వెలికితీస్తారు.