హైదరాబాద్ : తమ తాజా బ్రాండ్ కార్యక్రమంలో భాగంగా, దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్, టాటా టీ చక్ర గోల్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతిష్టాత్మక అంశాలను వేడుక చేస్తూ, విశాఖపట్నంలోని బీచ్‌మాల్ వెలుపలి భాగంలో భారీ 3 డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను నిర్వహించింది. ఇరు రాష్ట్రాలకూ గర్వకారణంగా నిలిచిన ప్రాంతీయ అంశాలను ఈ వేడుకలో భాగస్వామ్యం చేసింది. టాటా టీ చక్ర గోల్డ్ సైతం ఖచ్చితమైన కప్పు టీగా హాల్‌మార్క్‌గా నిలిచేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే 3డీ ప్రొజెక్షన్ ద్వారా టాటా టీ చక్ర గోల్డ్ అందిస్తుంది. దీనిలో కొండపల్లి బొమ్మల కథ ఉంటుంది. పూర్తి సరికొత్త చక్ర గోల్డ్ ప్యాక్‌లను ప్రత్యేకంగా ఏపీ, తెలంగాణా కోసం డిజైన్ చేశారు. కొండపల్లి బొమ్మలను అత్యంత అందంగా ఈ ప్యాక్‌లపై ముద్రించారు. ఇవి ఈ రాష్ట్రాల మహోన్నత చరిత్రను ప్రదర్శించడమే కాకుండా ఈ ప్రాంతాలకు ప్రత్యేకమైన కూచిపూడి నృత్యం, కలంకారి డిజైన్, తెలుగు లిపి, వరి క్షేత్రాలు సైతం వీటిలో ప్రదర్శిస్తారని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్యాకేజ్డ్ బేవరేజస్ అధ్యక్షులు పునీత్ దాస్ చెప్పారు.