న్యూదిల్లీ : జాతీయ సాంకేతిక విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్ సంస్థ.. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో (ఎన్‌ఎస్‌డీసీ) జతకలిసి కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో టెక్ నైపుణ్యాన్ని పెంపొందించేదుకు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం స్కిల్ అప్ ఇండియా 4.0ను విజయవంతంగా ప్రారంభించినట్లు నెక్స్ట్ వేవ్ వెల్లడిరచింది. యువతలో సాంకేతికపై అవగాహన కల్పించేందుకు గానూ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ, ఎంఎల్, ఫుల్ స్టాక్ డెవలప్ మెంట్ వంటి అధునాతన సాంకేతిక అంశాలను యువతకు ఆకళింపు చేసేలా దోహదం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు భవిష్యత్తు తరాలకు అనుగుణంగా యువతను నైపుణ్యం ఉన్న లీడర్లుగా, రూపకర్తలుగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తుంది.