హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద, వైవిధ్యభరితమైన ఆహార, వ్యవసాయ-వ్యాపార సంస్థలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జిఏవిఎల్), పంట రక్షణకు వాస్తవ-సమయంలో ఫోన్‌కాల్ ద్వారా నిపుణుల సలహాలను అందించడానికి బహుభాషా వ్యవసాయ సలహా హెల్ప్‌లైన్ ‘హలో గోద్రెజ్’ను ఇటీవల ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో-హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో- రైతులకు అందుబాటులో ఉండేలా రూపొందించిన, ఈ కొత్త కార్యక్రమం, రైతులకు పూర్తి చేయూత అందించటం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాలనే కంపెనీ ప్రయత్నాలకు అనుగుణంగా, రైతులకు అవసరమైనప్పుడల్లా ఒక్క కాల్ దూరంలో అందుబాటు ఉంటుందని గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్‌సింగ్ యాదవ్ అన్నారు.