హైదరాబాద్: డిస్నీలో వస్తున్న ‘షోగన్’కు ‘అత్యుత్తమ ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్’ చేసినందుకు భారత్‌లోని హైదరాబాద్‌లో ఉన్న పిక్సెల్లాయిడ్ స్టూడియోస్ ఎమ్మీ అవార్డు గెలుచుకోవడంతో ఒక మైలురాయిని సాధించింది. ఈ షో కోసం 150 మందితో కూడిన బృందం 2,800 పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్‌లపై అవిశ్రాంతంగా పని చేసింది. ఈ షాట్స్ జపాన్ ఫ్యూడల్ ప్రపంచానికి జీవం పోశాయి. కష్టమైన 3డీ సెట్ ఎక్స్‌టెన్షన్‌ల నుంచి విజువల్ ఎఫెక్ట్‌ల వరకు ఎంతో వర్క్ చేసింది. ఈ సిరీస్ విజయంలో పిక్సెల్లాయిడ్ పాత్ర కీలకమైనది. వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ మైఖేల్ క్లైట్ గతంలో శ్రీరామరాజ్యం, బిజినెస్ మేన్ తదితర భారతీయ చిత్రాలకు పిక్సెల్లాయిడ్‌తో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా మైఖేల్ క్లైట్ మాట్లాడుతూ షోగన్ కోసం పిక్సెల్లాయిడ్ బృందంతో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం అన్నారు.