ముంబయి: తమ ప్లాట్‌ఫారంలో ‘డైలీ సేవింగ్స్’ పేరుతో కొత్త ఉత్పత్తిని ప్రారంభించడం కోసం జార్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫోన్‌పే ప్రకటించింది. తద్వారా రోజురోజుకు పెంచుకునే డైలీ కంట్రిబ్యూషన్ల ద్వారా 24కే డిజిటల్ గోల్డ్‌లో డబ్బును సేవ్ చేసుకోవచ్చు. డైలీ సేవింగ్స్ ద్వారా, యూజర్లు రోజుకు రూ.10తో ప్రారంభించి, గరిష్ఠంగా రూ.5000 వరకు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది సామాన్యులకు ఒక నిరంతరమైన పొదుపు అలవాటును నిర్మించుకునే శక్తిని ఇస్తుంది. కేవలం 45 సెకన్లలో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించే రీతిలో జార్ సంస్థ ప్రవేశపెట్టిన ఇంటగ్రేటడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్ ఈ ప్రవేశపెడుతోంది.