ముంబయి : లీనమయ్యే వినోద అనుభవాలలో అగ్రగామిగా ఉన్న డాల్బీ లేబొరేటరీస్, డాల్బీ అట్మోస్ ఆడియో ఇప్పుడు, భారతదేశంలోని యువత అత్యంత ఇష్టపడే బ్యాటిల్ రాయల్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)లో అందుబాటులోకి వచ్చిందని దాని రూపకర్తలు క్రాఫ్టాన్ ప్రకటించింది. బీజీఎంఐ అరేనా లేదా టీమ్ డెత్ మ్యాచ్ మోడ్‌లో, గేమింగ్ అనుభవంలో వాస్తవంలో వినిపించే శబ్దాన్ని అగ్రస్థానంలో ఉంచుతుంది. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలోని డాల్బీ అట్మోస్-అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల వినియోగదారులు డాల్బీ అట్మాస్‌లో బీజీఎంఐని మరింత చక్కగా ఆస్వాదిస్తారు. దీనితో మొబైల్ ప్లేయర్‌లు డాల్బీతో తమ అభిమాన గేమ్‌ను మరింత ఎక్కువగా ఇష్టపడతారని క్రాఫ్టాన్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ సెద్దార్థ్ మెర్రోత్రా తెలిపారు.