హైదరాబాద్: భారతదేశంలో ఆల్గోరాండ్ ఫౌండేషన్ తన కార్యకలాపాలను ఆల్గో భారత్ పేరుతో మొదలుపెట్టింది. ఇందుకోసం ఆల్గో భారత్ ఇటీవలే రోడ్ టు ఇంపాక్ట్ ఇన్షియేటివ్ రెండో ఎడిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా భారతదేశంలో అల్గోరాండ్ ఫౌండేషన్ కార్యకలాపాలు చూస్తున్న డాక్టర్ నిఖిల్ వర్మ నేతృత్వంలోని బృందం ఎనిమిది నగరాల్లో పర్యటించింది. ప్రతి ఈవెంట్‌లో యువ వెబ్ 3 డెవలపర్‌లు, స్టార్టప్ టీమ్‌లు నాలుగు నెలల పాటు జరిగే వర్క్‌షాప్‌ల ప్రక్రియలో పోటీ పడతారు. అంతేకాకుండా ఆ తర్వాత డిసెంబర్ ప్రారంభంలో ఫౌండేషన్ ఇండియా సమ్మిట్‌లో కూడా ఒకరితో ఒకరు పోటీ పడతారు. వెబ్ 3 డెవలపర్లు, ఆవిష్కరణలకు భారతదేశం ఒక ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. వివిధ నివేదికల ప్రకారం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో అగ్రగామిగా ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బ్లాక్‌చెయిన్ డెవలపర్‌ల వాటా 2018లో 3% ఉంటే ఆ తర్వాత గతేడాదికి అది 12%కి పెరిగింది.