న్యూఢల్లీి: లండన్‌కు చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, తమ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్ విక్రయాల ప్రారంభాన్ని ప్రకటించింది. భారతదేశంలో 07వ తేదీ ఆగస్ట్ (మధ్యాహ్నం 12 గంటలు) నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంతగానో అంచనాలు వేయబడిన ఈ డివైజ్ ఫోన్ (2ఎ) విజయంపై రూపొందింది. ఫోన్ పెర్ఫార్మెన్స్, కెమేరా సామర్థ్యాలు, డిజైన్‌ను మెరుగుపరిచింది. ఫోన్ (2ఎ) ప్లస్ ప్రత్యేకమైన మీడియా టెడ్ డైమన్సిటి 7350 ప్రో 5జి ప్రాసెసర్ ద్వారా మద్దతు చేయబడిరది. సాఫీ, వేగవంతమైన యూజర్ అనుభవం నిర్థారిస్తోంది. స్మార్ట్‌ఫోన్ టీఎఎస్‌ఎంసీ 4ఎన్‌ఎం జెన్ 2 టెక్నాలజీ, ఆర్మ్ మ్యాటీ మాలీ జీ`610 ఎంసీ4 జీపీయూ నథింగ్ స్మార్ట్ క్లీన్ టెక్నాలజీని కలిగి ఉంది. ముఖ్యంగా, ఫోన్ (2ఎ) ప్లస్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వచ్చింది. ఇది మూడేళ్ల వరకు సాఫ్ట్ వేర్ అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వాగ్థానం చేసింది. ఫోన్ (2ఎ) ప్లస్ గ్రే, నలుపు మొబైల్స్‌తో లభిస్తోంది, ఈ రెండు మోడల్స్ నుండి ప్రజలు ఎంచుకోవచ్చు. ధర రూ. 27,999 నుంచి లభిస్తోంది ఫోన్ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్‌సేల్స్, ఇతర రీటైల్ భాగస్వాముల వద్ద లభిస్తోంది.