ముంబయి: వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా భారతదేశంలో వి40 సిరీస్‌తో ఎంతో ఇష్టపడే వి సిరీస్ ఫోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వి40 మరియు వి40 ప్రోతో కూడిన, వివో వి40 సిరీస్ వి సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. వి40 సిరీస్‌లో జెయిస్ కో-ఇంజనీరింగ్ ఇమేజింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి. అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ ఇమేజింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. వి40, వి40 ప్రోతో, వివో జెయిస్‌తో తన దీర్ఘకాల గ్లోబల్ ఇమేజింగ్ భాగస్వామ్యాన్ని వి సిరీస్‌కు విస్తరిస్తోంది. సిరీస్ ఇప్పుడు జెయిస్ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్, జెయిస్ స్టైల్ పోర్ట్రెయిట్, జెయిస్ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా వంటి ప్రో-లెవల్ కెమెరా ఫీచర్లను అందిస్తుంది. వివో భారతీయ వినియోగదారుల కోసం ట్యూన్ చేసిన వెడ్డింగ్ స్టయిల్ పోర్టెయిట్‌తో పాటు వినూత్నమైన ఫెస్టివల్ పోర్ట్రెయిట్ మోడ్‌ను కూడా పరిచయం చేసింది. వివో వి40 ప్రో ఆగస్ట్ 13 నుండి అమ్మకానికివస్తుంది, రెండురంగుఎంపికలలోవస్తుంది – అవి: గంగా బ్లూ, టైటానియం గ్రే.