హైదరాబాద్ : రియల్‌మి తాజాగా జీటీ సిరీస్‌కు రియల్‌మి జీటీ నియో 2 5జిని జోడిరచింది. ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ న్ 870 5జి ప్రాసెస్‌తో శక్తివంతమైంది. 120హెచ్‌జెడ్ ఈ4 ఎమోల్డ్ డిస్ ప్లే, 65 డబ్ల్యూ సూపర్ డార్ట్ చార్జ్, 5000 ఎంఏహెచ్ లార్జ్ కెపాసిటీ బ్యాటరీ, పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఏరియా, 64 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమె రా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 7 జీబీ డైనమిక్ రామ్ ఎక్స్ పాన్షన్, జీటీ మోడ్ 2.0, డిజిటల్ అర్బన్ డిజైన్ వంటి విశిష్టతలు ఇందులో ఉన్నాయి. నియో గ్రీన్, నియో బ్లూ, నియో బ్లాక్ అనే మూడు రంగుల్లో లభ్యం. 8జీబీG 128జీబబీ వెల రూ. 31,999. 12జీబీG 256జీబీ వెల రూ. 35,999. అలాగే, రియల్ మి 4కె స్మార్ట్ టీవీ గూగుల్ స్టిక్ అనేది నూతన గూగుల్ టీవీ ప్లాట్ ఫామ్. ఇది 4కేపి60 సపోర్ట్, హెచ్ డిఆర్10 ప్లస్ ఎన్ కోడిరగ్, హెచ్ డిఎంఐ 2.1, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ సూపర్ ర్యామ్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్, 5 జీహెచ్‌జెడ్ వైఫై, బ్లూ టూత్ 5.0 లను కలిగిఉంటుంది. వెల రూ.3,999. పండుగ రోజుల్లో రూ.2,999 లకే లభ్యం. ఇవన్నీ అక్టోబర్ 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్, మెయిన్ లైన్‌చానల్స్‌లో విక్రయాలు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్ సభ్యులు అక్టోబర్ 16 నుంచే ఎర్లీ యాక్సెస్ పొందగలుగుతారు. రియల్ మి బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, రియల్‌మి కూలింగ్ బ్యాక్ క్లిప్ నియో, రియల్‌మి టైప్-సి సూపర్ డార్ట్ గేమ్ కేబుల్ 7.6 ఎంఎం, రియల్ మి బడ్స్ ఎయిర్ 2 (క్లోజర్ గ్రీన్)లు కూడా విడుదలవుతున్నాయి.