న్యూదిల్లీ: సింగపూర్‌లో తన మర్చంట్ స్వీకరణ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో డిజిటల్ దేశాంతర పేమెంట్ సొల్యూషన్స్‌లో అగ్రగామి ఫిన్‌టెక్ సంస్థగా ఉన్న లిక్విడ్ గ్రూప్‌తో తాము భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ఫోన్‌పే ప్రకటించింది. ఈ భాగస్వామ్యం భారతీయ సందర్శకుల పాపులర్ విహార కేంద్రమైన సింగపూర్‌లో విస్తారంగా ఉన్న లిక్విడ్ గ్రూప్ మర్చంట్ల వద్ద యూజర్లు తమ ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించుకుని, స్కాన్ చేసి, పే చేసేందుకు పర్యాటకులకు వీలు కల్పిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్లు చాంగి ఎయిర్ పోర్ట్, డ్యూటీ ఫ్రీ షాపులు, రెస్టారెంట్లు, బార్లు, ది కోకో కోలా ట్రీస్, ఛార్లెస్ అండ్ కీత్, లువెనస్ జ్యూవలరీ, హార్డ్ రాక్ కేఫ్ లాంటి రీటైలర్లు, సైట్ సీయింగ్ ప్రదేశాలు, ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు లాంటి వాటిలో విస్తారంగా అందుబాటులో ఉంటాయి. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్)తో లిక్విడ్ గ్రూప్ కుదుర్చుకున్న భాగస్వామ్యం ద్వారా ఈ భాగస్వామ్య ఒప్పందం జరిగింది.