ముంబై : వరుసగా ఎనిమిదో సారి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యదాతథంగా ఉంచింది. దీంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపోరేటు 3.35 శాతంగా కొనసాగనుంది. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు చివరిసారి 2020 మేలో ఆర్బీఐ రెపోరేటును 4 శాతానికి కుదించింది. నాటి నుంచి యదాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వెల్లడిరచింది. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమవేశం నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశామని, 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంపై స్పష్టమైన సంకేతాలు ఉన్నాయన్నారు. క్యాపిటల్ గూడ్స్‌కి డిమాండ్ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోందని దాస్ తెలిపారు. కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందని, భారీ ఎన్‌బీఎఫ్‌సీల్లో కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు దాస్ వెల్లడిరచారు. ఐఎం పీఎస్ లావాదేవీల పరిమితి పెంపు ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్ లావాదేవీల పరిమి తిని ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం ఐఎంపీస్ ద్వారా గరి ష్ఠంగా రూ.2లక్షల వరకు బదిలీ చేసే వీలుం డగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ గరవ్నర్ శక్తికాంత దాస్ ఈ మేరకు వెల్లడిరచారు. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయని, వినియోగదారులకు కూడా సులువుగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. దీనిపై త్వరలోనే బ్యాంకులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.