మంచిర్యాల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి వరదలు ప్రజల జీవితానికి, ఆస్తికి విస్తృత స్థాయిలో నష్టాన్ని కలిగించాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావితం వల్ల నష్టపోయిన తమ వినియోగదారులకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సత్వర సహాయాన్ని అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ క్లిష్ట సమయాల్లో తన కస్టమర్లు తిరిగి కోలుకోవడానికి సకాలంలో, సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్లను అందించి వారి పట్ల తమ నిబద్ధతను తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ క్లిష్టమైన సమయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందన్నారు. కస్టమర్ ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయబడిరదన్నారు. అవాంతరాలు లేకుండా క్లెయిమ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కస్టమర్ సపోర్ట్ కోసం అత్యవసర టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1800 209 7072 ఏర్పాటు చేశారు.